Posts

స్పందన ప్రకృతి ధర్మం

స్పందన ప్రకృతి ధర్మం! ----------------------- వర్షం కురిస్తే మట్టిలో విత్తనాలు మొలకెత్తుతాయి శిశిరం వస్తే చెట్లు ఆకులు రాలుస్తాయి అందాలను చూస్తే హృదయాలు ఆనందంతో చిందులేస్తాయి వేదన కలిగితే కళ్ళు కన్నీటిని కారుస్తాయి స్పందన ప్రకృతి ధర్మం!స్పందనే జీవనం! స్పందిస్తేనే మనిషివి లేకుంటే మరవి! దారి వెంట బిచ్చగాడు చాస్తే చేయి పో పొమ్మనక తోచినంత దానం చేయి చిన్ని మొక్క కనిపిస్తే ఎండిపోయి అన్ని నీళ్లు తెచ్చి దానికి పోయి ఆర్తునిపై పడితే నీ కన్నుదోయి ఆగి సాయం చేయకుండ పోరాదోయి స్పందించే మనసుంటేనే మనిషి వౌతావోయి! -by-కొండవీటి అంతయ్య,
Recent posts